
Srisaila Devasthanam: His Holiness Sri Ganapati Sachchidananda Swami, Mysuru AvadhootaDatta Peetham visited Srisaila Devasthanam on 16th Jan.2023. E.O. S.Lavanna and other officials, Archaka swaamulu received with temple honours.
శ్రీశైల దేవస్థానం: శ్రీ స్వామిఅమ్మవార్లను మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీవారు సేవించారు.ఆలయం వద్దకు చేరుకున్న వీరికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అర్చకస్వాములు, వేదపండితలు పూర్ణకుంభస్వాగతం పలికారు.తరువాత పీఠాధిపతివారు స్వామివారికి అభిషేకాన్ని జరిపించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో దేవస్థానం పీఠాధిపతుల వారిని సత్కరించింది.