
శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం బుధవారం మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారిచే ఆదిశంకరాచార్యులు రచించిన శివానందలహరి పై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని ధర్మపథం ( నిత్యకళారాధన) వేదిక వద్ద సాయంకాలం గం. 7.00ల నుండి గం. 8.30ల వరకు ఈ ప్రవచన కార్యక్రమం ఉంటుంది.సందర్భానుసారంగా ప్రసంగంలో శ్రీశైల క్షేత్ర మహిమ, సనాతనధర్మం మొదలగు అంశాలను కూడా గరికిపాటి వివరిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొంతకాలం తపమాచరించిన శంకర భగవత్పాదుల వారు ఇక్కడి పాలధార – పంచధార వద్దనే శివానందలహరిని రచించారు.
భక్తులందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనాలను విని తరించవలసినదిగా దేవస్థానం కోరింది.
*file ఫోటో * courtesy-Wikipedia*