సమగ్ర భూసర్వే పనులు పూర్తి – ఈ ఓ ప్రశంస
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు చేపట్టిన సమగ్ర భూసర్వే పనులు పూర్తయ్యాయి.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, అటవీశాఖ, దేవస్థానం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి .
ఈ సందర్భంగా శనివారం భూ సర్వే పనులకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. గుర్తించిన 7 చదరపు మైళ్ళ క్షేత్ర సరిహద్దులకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు.సమావేశంలో సర్వేశాఖ అధికారులు వీడియో డాక్యుమెంటేషన్ ప్రదర్శన ద్వారా భూ సర్వే సరిహద్దులను వివరించారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నంద్యాల జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పి. హరికృష్ణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి నరసింహులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి. రవి, దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టీ. శ్రీనివాసరావు, దేవస్థానం రెవెన్యూ విభాగం పర్యవేక్షకులు కె. అయ్యన్న, పలువురు దేవస్థాన ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గత జూన్ 22వ తేదీన ఈ సరిహద్దులు గుర్తించేందుకు బైర్లూటిలోని ఏకో టూరిజం సెంటర్ దేవస్థానం, అటవీశాఖ అధికారులు మొదటి సమావేశం జరిగింది. సరిహద్దులకు సంబంధించి ఆయా ప్రాథమిక అంశాలు చర్చించారు.
ఆ తరువాత సెప్టెంబరు 29న విజయవాడలో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీశాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు డా. హరిజవహర్ లాల్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మధుసూదన్రెడ్డి, అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, సంబంధితశాఖల, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు శాఖ వారి ఆధ్వర్యంలో , అటవీ, దేవస్థాన అధికారుల సమక్షములో సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.తదనుగుణంగా శ్రీశైలం ఎన్ క్లోజర్ ( శ్రీశైలక్షేత్రపరిధి) హాఠకేశ్వరం , శిఖరేశ్వరాలలో ఈ సర్వే చేపట్టారు.
దేవస్థానం, అటవీశాఖ అధికారులతో పాటు మొత్తం 16 మంది జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దాదాపు నెలరోజులపాటు ఈ సమగ్ర భూసర్వే జరిగింది.
ఈ భూసర్వే పూర్తయిన సందర్భంగా శనివారం సర్వే పనులపై పూర్తి స్థాయి సమీక్ష చేసారు.
సమావేశంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సర్వేకు ఆదేశించిన ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డికి, దేవదాయ ముఖ్య కార్యదర్శి కి, దేవస్థాన కమిషనర్కు , అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ , స్థానిక డి.ఎఫ్.ఓ , ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, అటవీ, మండల రెవెన్యూ అధికారులకు , దేవస్థాన ఇంజనీరింగ్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశ చివరిలో ఆయా శాఖల అధికారులకు, సిబ్బంది, పలువురు దేవస్థాన సిబ్బందికి దేవస్థానం తరుపున కార్యనిర్వహణాధికారి ప్రశంసాపత్రాన్ని, శ్రీస్వామివార్ల శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.
Post Comment