* బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్
* క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు..
* తూ చా తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే జరగవు…
* మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటామో కూడా అంతగా ప్రేమించాలి అనే
మానవత్వం క్రీస్తు సొంతం..
* తనను హింసించిన వారిని సైతం క్షమించే గుణం మహోన్నతమైనది..
* క్రీస్తు బోధనలకు మరింత ప్రచారం జరగాలి, వసుదైక కుటుంబ భావన విశ్వమంతా
పరిణవిల్లాలి..
శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే
స్పూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం. ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి
సహకారం అవసరం” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి
దూత ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ త్వానికి వసుదైక కుటుంబ స్థాపనకు దారులు
వేస్తాయని సీఎం అన్నారు. క్రీస్తు బోధనలను తూచా తప్పకుండా పాటిస్తే కోపము ద్వేషము
ఉండవని, ప్రతి మనిషి క్షమాగుణం తో జీవిస్తే ఈ నేలమీద యుద్దాలే జరగవని సీఎం కేసీఆర్
స్పష్టం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడని
సీఎం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
