ముచ్చటగా చంద్రఘంట అలంకారం, రావణవాహనసేవ
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు. రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు. ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపారు.
రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రి పూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరిగాయి. దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహించడం ఆనవాయితి.ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం ప్రత్యేకం. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
చంద్రఘంట అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని చంద్రఘంట స్వరూపంలో అలంకరింపచేసారు.నవదుర్గలలో మూడవ రూపమైన ఈ దేవి దశ భుజాలను కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా ఉంటుంది. ఈ దేవి శాంతస్వరూపిణి అయినప్పటికీ యుద్దాన్ముఖురాలై ఉండటం విశేషం.ఈ అమ్మవారి మస్తకంపై అర్థచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు.
ఈ దేవిని పూజించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తీరుతాయని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇంకా ఈ దేవీ ఆరాధన వల్ల సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు రావణవాహనసేవ నిర్వహించారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి,
రావణవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు.
Post Comment