శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని ఈ ఓ తెలిపారు.శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు మొదలైనవారంతా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి బదులు కాగితపు కవర్లు, గుడ్డ సంచులు (వస్త్రంతో రూపొందించిన సంచులు), జ్యూట్ బ్యాగులు మొదలైనవాటిని వినియోగించవలసినదిగా ఈ ఓ కోరారు.
ఈ నెల 26వ తేదీ నుంచి క్షేత్రపరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామన్నారు ఈ ఓ. అందరు కూడా ఈ నెల 26వతేదిలోగా తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసినదిగా కోరారు. ఈ నెల 26వ తేదీ తరువాత ప్లాస్టిక్ కవర్లను వినియోగించినట్లు దృష్టికి వస్తే తగు అపరాధరుసుం కూడా విదిస్తామన్నారు.
గత సంవత్సటం నవంబరులో దేవస్థానం పరిపాలనా భవనములో ప్లాస్టిక్ వాడక నిషేధంపై స్థానిక వ్యాపారులకు, హోటళ్ళ నిర్వాహకులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో విషయ నిపుణులు ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాలు, ప్లాస్టిక్ స్థానములో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయాల గురించి అవగాహన కల్పించారు. స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులు మొదలైనవారందరు ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించవలసినదిగా ఈ ఓ కోరారు.