*రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు , అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. సీఎం కేసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్‌లో పాల్గొన్నారు. అన్న హిమాన్షు కు చెల్లి అలేఖ్య రాఖీ కట్టింది. అంతకు ముందు ఉదయం ప్రగతి భవన్ లో, కేటీఆర్ కు చెల్లి కవిత రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్ చెల్లెలు సౌమ్య (చిన్నమ్మ కూతురు, సంతోష్ కుమార్ సోదరి) రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ రక్షా బంధన్ వేడుకలో పాల్గొన్నారు. ప్రగతి భవన్ కార్యాలయ మహిళా సిబ్బందికి రాఖీ వేడుకల సందర్భంగా మిఠాయిలు పంచారు.