శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం సోమవారం కాకినాడలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం కాకినాడలో వేంచేసివున్న కంచికామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామివారికి వస్త్ర సమర్పణ చేసారు.రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు తదితర సిబ్బంది కాకినాడలో పంచాంగ సదస్సు కార్యక్రమానికి వెళ్ళారు.ఈ సందర్భంగానే దేవస్థానం తరుపున ‘గురువందనం’ చేసారు.
దేవస్థాన కార్యనిర్వహణాధికారిఎస్.లవన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ అవధాని, పోలేపెద్ది వేంకట సుబ్రహ్మణ్యం, శ్రీస్వామివారి అర్చకులు, జె. ఆర్. హరిశ్చంద్రమౌళి, శ్రీ అమ్మవారి అర్చకులు బి. సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.