
ఆదివారం ఏరియల్ సర్వే కోసం వరంగల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.,హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏటూరునాగారం తదితర వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు.చేపట్టవలసిన మరిన్ని సహాయ కార్యక్రమాలు, చర్యలపై ఆరా తీస్తూ, తగు సూచనలిస్తున్నారు.