
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం టి.పి.మోహన్ కుమార్ బృందం హైదరాబాదు భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి కార్యక్రమం జరిగింది. పలు భక్తి గీతాలు, అష్టకాలు మొదలైన వాటిని,టి.పి మోహన్ కుమార్ గానం చేసారు. వయోలిన్ సహకారాన్ని శ్రీనివాసాచార్య, కీబోర్డ్ సహకారాన్ని సుదర్శన్, మృదంగ సహకారాన్ని లక్ష్మి అజయ్ అందించారు.
17 న వి.ఎన్.ఆర్.కె. కళాక్షేత్రం బృందం హైదరాబాదు సంప్రదాయ నృత్య కార్యక్రమం సమర్పించనుంది..