
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం వై.జయకృష్ణ బృందం, మైదుకూరు మోహినీ భస్మాసుర హరికథ కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి మోహినీ భస్మాసుర హరికథ కార్యక్రమం జరిగింది. హరికథ కార్యక్రమానికి ఎం.రమేష్ హార్మోనియం సహకారాన్ని అందించగా, సుధాకర్ మృదంగ సహకారాన్ని అందించారు.
| బుధవారం సాంస్కృతిక కార్యక్రమాలు |
శ్రీ ప్రద్యుమ్న బృందం కర్ణాటక , సంప్రదాయ నృత్య కార్యక్రమం సమర్పించనుంది .