శ్రీశైల దేవస్థానం:ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలుపరచడంలో భాగంగా లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాల కేటాయింపునకు శుక్రవారం చంద్రవతి కల్యాణ మండపంలో డిప్పు నిర్వహించింది.దేవస్థానం ప్రకటన లో వివరాలు ఇవి.
ఈ డిప్పులో మొత్తం 24 మంది దుకాణదారులు పాల్గొన్నారు. గతం లో శ్రీలలితాంబికా దుకాణ సముదాయము దుకాణాల కేటాయింపునకు నిర్వహించిన బహిరంగ వేలం లో పాల్గొన్న వారిలో కొందరు తమకు దుకాణాలను కేటాయించవలసిందిగా ఉన్నత న్యాయస్థానము లో వ్యాజ్యములు దాఖలు చేసారు. వీరికి దుకాణాలను కేటాయించవలసిందిగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా మే 20వ తేదీన న్యాయస్థానములో వ్యాజ్యము చేసిన 40 మందికి దుకాణాలను కేటాయించారు.తదుపరి ఉన్నత న్యాయస్థానంవారు ఈ సంవత్సరం మార్చి 3వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 15వ తేదీన దేవస్థానం కార్యాలయములోని సమావేశ మందిరం లో డిప్పును నిర్వహించి మొత్తం 30 మంది చెంచు గిరిజనులకు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం లో 30 దుకాణాలు కేటాయించారు.
కాగా ఇప్పటి వరకు శ్రీలలితాంబికా వాణిజ్యసముదాయము లో మొత్తం 94 దుకాణాలను, న్యాయస్థానములో వ్యాజ్యము దాఖలు చేసినవారికి 40 దుకాణాలను,, చెంచుగిరిజనులకు 30దుకాణాలను, ఈ రోజు (17.06.2022) డిప్పులో పాల్గొన్న వారికి 24 దుకాణాలను కేటాయించినట్లయింది.
మొత్తం వాణిజ్యసముదాయం లోని 203 దుకాణాలలో ఇప్పటి వరకు కేటాయించిన 94 దుకాణాలు పోగా, మిగిలిన 109 దుకాణాలకు బహిరంగవేలం నిర్వహించేందుకు తగు చర్యలు చేపడుతారు. ఉన్నత న్యాయస్థానం ఈ సంవత్సరం మార్చి 3వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ బహిరంగవేలాలు నిర్వహిస్తారు.
ఈ రోజు జరిగిన దుకాణాల కేటాయింపు కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహంత్ మహేష్, మేరాజోత్ హనుమంతనాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, దేవస్థానం రెవెన్యూ విభాగం సిబ్బందితో పాటు పలు ఇతర విభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు డిప్ నిర్వహణకు స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.