
శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశసదనములోని ఒక గది నిర్మాణానికి బొమ్మిడాల నారాయణమూర్తి, గుంటూరు గురువారం రూ. 15 లక్షలు విరాళంగా అందజేశారు. గతించిన వారి భార్య శ్రీమతి బొమ్మిడాల వెంకట రత్నమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లుగా తెలియజేశారు.ఈ మేరకు దాత మనవడు పెండేకంటి రఘునాథ్, విరాళ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్టును ధర్మకర్తల మండలి అధ్యక్షులు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నకు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.