
శ్రీశైలదేవస్థానం:శ్రీశైల మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ఉదయం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం గోశాల సమీపంలో హేమారెడ్డి మల్లమ్మ ( మల్లమ్మకన్నీరు) మందిరంలో విశేషపూజలు జరుగుతాయి.
మల్లమ్మకథ ఎంతో ప్రసిద్ధం:
మల్లమ్మ తల్లిదండ్రులు వీరశైవ సంప్రదాయ పరాయణులైనందున మల్లమ్మకు బాల్యం నుండే మల్లికార్జునస్వామివారిపై భక్తి అలవడింది. మల్లమ్మ తల్లిదండ్రులకు సంతానం లేని కారణంగా సంతానం కోసం వారు మల్లికార్జున స్వామివారిని సేవించారు. ఒకనాడు మల్లికార్జునస్వామి కలలో కనిపించి వారికి కుమార్తె కలుగుతుందని, ఆమె వలన వారి వంశం చరితార్ధం అవుతుందని చెప్పారు.
యుక్త వయస్సు రాగానే మల్లమ్మకు తల్లిదండ్రులు వివాహం జరిపిస్తారు. మల్లమ్మ అత్తవారింట అడుగు పెట్టిన వేళావిశేషంతో వారి ఆస్తిపాస్తులు ఎంతగానో పెరుగుతాయి. మల్లమ్మ సహృదయం కారణంగా అందరు కూడా మల్లమ్మను గురించి గొప్పగా చెప్పుకుంటారు.దాంతో మల్లమ్మ తోటికోడలు, ఆమె అత్తగారు మల్లమ్మకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. అయినప్పటికి ఎప్పటికప్పుడు మల్లికార్జున స్వామివారు ఆమె కష్టాలను పరిహరింపజేస్తుంటాడు.
చివరకు చెప్పుడు మాటలు విని మల్లమ్మ భర్త ఆమె శీలాన్ని శంకించి, మల్లమ్మ మెడను నరకబోతాడు. అప్పుడు మల్లికార్జునస్వామి వారి మహిమతో వెంటనే అతని చేతిలోని కత్తి రెండు ముక్కలవుతుంది.
దాంతో వాస్తవాన్ని తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు మల్లమ్మను మన్నించమని వేడుకుంటారు. అయినప్పటికి లౌకిక జీవితంపై విరక్తి కలిగిన మల్లమ్మ వైరాగ్యంతో కుటుంబాన్నంతా వదిలివేసి శ్రీశైలక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని సేవిస్తూ, క్షేత్రానికి విచ్చేసే భక్తులకు శివతత్త్యాన్ని బోధిస్తూ చివరకు శివసాయుజ్యం పొందిందని ప్రతీతి.
*Srisaila Giri Pradikshana special today.
* Sampradhaaya Nruthyam performed in Kalaaraadhana
*Laksha kumkumarchana paroksha seva performed in the temple
*Uyala Seva, Pallaki Seva performed in the temple
*Donation of Rs.1,00,116 for Annadanam scheme by Smt K. Vijaya Kumari ,Kadapa on the Name of Poliboyina Venkata Rayulu.