
Srisaila devasthanam: Dattathreya Swamy Puuja performed in the temple on 12th May 2022. Archaka swaamulu performed the event.
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం శ్రీ మంథా రాగాలయ అకాడమి, హైదరాబాద్ వారు భక్తి సంగీత విభావరి సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో మహాగణపతిం, ప్రభుం ప్రాణనాథం, భో శంభో, నాలోన శివుడు, ఓం నమ:శివాయ తదితర గీతాలను మంథా శ్రీనివాస్, శ్రీవాస్తవ, తుంగవిద్య, జేష్ఠశ్రీ, నందన, చిన్మయి, శ్రీధర్, నరసింహ, మణిమాలా తపస్వీ, సమన్వితా, మంథా భరద్వాజ ఆలాపించారు.
నృత్య ప్రదర్శన:
మాధవిశర్మ బృందం, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమంసమర్పించింది. ఈ కార్యక్రమములో ఆనందనర్తనగణపతి, కైలాసవాస, భో….శంభో, లోకేశుని కల్యాణం, ఓం హర హర శంభో శంకర, శివతాండవం తదితర గీతాలకు శ్రీమతి మాధవి శర్మ, మహేశ్వరి, చన్నకేశ్వరి, శ్రీకృతి, హరిప్రియ, మన్వితా, అవ్వి కిశోర్, మనోజ్ఞ, రూప, సంజన, శ్రావణి నృత్య ప్రదర్శనను అందించారు.
13న యశ్వంత్ దీక్షిత్, హైదరాబాద్ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించనుంది.