
శ్రీశైల దేవస్థానం: గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ 3,09,52,777/-.. నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 27 రోజులలో (08.04.2022 నుండి 04.05.2022 వరకు) సమర్పించారన్నారు.
ఈ నగదుతో పాటు,267-000 గ్రాముల బంగారు , 05 కేజీల 290- గ్రాముల వెండి లభించాయి. 323 యు.ఎస్.ఏ డాలర్లు 197సౌధీ రియాల్స్ 130.కెనడా డాలర్లు, 40 ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని ఈ ఓ వివరించారు.
అన్నదానం హుండీల లెక్కింపు:
అన్నదానం హుండీ లెక్కింపు ద్వారా రూ.7,02,029 -00 దేవస్థానానికి నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 27 రోజులలో (08.04.2022 నుండి 04.05.2022 వరకు) సమర్పించారు.