ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం బాషా సంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ” జానపద జాతర – 2016 ” నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు.
రవీంద్రభారతి లో ముగింపు వేడుకల కార్యక్రమానికి వేదిక అయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి దాదాపు 5000 (5 వేల) మంది కళాకారులు వివిధ జిల్లాలనుంచి విచ్చేసారు. కార్యక్రమంలో గిరిజన, సంస్కృతిక శాఖ మంత్రి శ్రీ అజ్మీరా చందూలాల్ గారు, శాసన సభ్యులు మరియు సాంస్కృతిక సారధి అధ్యక్షులు శ్రీ రసమయి బాలకిషన్ గారు, సంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు, ప్రముఖ కళాకారులు: బిందు, గడ్డం సమ్మయ్య , ఒగ్గు కచ్చు అంజయ్య , జానపద అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి లింగయ్య, జిల్లాల జానపద అధ్యక్షులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారుల బృందాలు చక్కటి ప్రదర్శనలతో అక్కటుకున్నారు.
ప్రదర్శనల అనంతరం కళాకారులందరూ 5000 మంది కల్చరల్ కార్ణివల్ కళా ప్రదర్శనలను అద్భుతంగా చేసుకొంటూ అసెంబ్లీ గుండా లలితకళా తోరణంకి ర్యాలీగా వెళ్లారు.