
Srisaila Devasthanam: B.Sridhar, Kurnool donated Rs.One Lakh For Annadanam scheme on 21st March 2022.
*బంగారు ఆభరణాల సమర్పణ:
వి. ప్రహ్లాదరావు, లత, డోన్, కర్నూలు జిల్లా వారు రెండు బంగారు దండలను దేవస్థానానికి సమర్పించారు.వీటిలో కెంపులు , పచ్చలతో కూడిన డాలరు కలిగిన 29 గ్రాముల బంగారు దండ, బిల్వం డాలరు కలిగిన 20 గ్రాముల బంగారు దండ ఉన్నాయి.అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు అభరణాలను ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారివారికి అందజేశారు.ఈ సమర్పణ అనంతరం దాతలకు వేదాశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందించారు.
*నూతనయాగశాల ప్రారంభం:
శ్రీశైలం అమ్మవారి నూతన యాగశాల ప్రారంభమైంది. భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయములో రాతికట్టడంతో నూతనయాగశాలను నిర్మించారు. బట్టా పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి, హైదరాబాద్ వారు ఈ యాగశాలను నిర్మింపజేశారు. 29.11.2020న ఈ యాగశాల నిర్మాణ పనులను ప్రారంభించారు.కృష్ణశిలతో 16 స్తంభాలతో ప్రతి స్తంభంపైన అనేక దేవతామూర్తుల రూపాలతో ఈ నూతన యాగశాల నిర్మాణం జరిగింది.
ముఖ్యంగా చండీ సప్తశతిలో పేర్కొన్న బ్రాహ్మీ, నందజ, రక్తదంతిక, శాకంభరి, దుర్గా, భీమా, భ్రామరి మొదలైన దేవతారూపాలను, నవదుర్గలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కుష్మాండదుర్గ, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి,సిద్ధిదాయినీ మొదలైన దేవతలను అష్టాదశశక్తిపీఠాలలో నెలకొన్న 18 దేవతా రూపాలను, ఇంకా సప్తమాతృకలను, మరికొన్ని శక్తి రూపాలను మలిచారు.ఈ దేవతా రూపాలు మొత్తం 62, యాగశాల బయట చండీ, ముండీ ద్వారపాలకీ రూపాలను ఏర్పాటు చేసారు.యాగశాల పై భాగాన శిఖరాన్ని నిర్మించి, దానిపై సువర్ణ కలశాన్ని ఏర్పాటు చేశారు.
సోమవారం ఉదయం బట్టా పర్వతయ్య కుటుంబ సభ్యులు సంప్రదాయ పూర్వకంగా స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు చేసుకుని, అమ్మవారి ఆలయము నుండి సువర్ణ కలశం తీసుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో విశేషపూజాదికాలు జరిపారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేశారు. అనంతరం పుణ్యాహవాచనం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణ, కలశానికి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత కలశానికి విశేష అర్చనలు జరిపారు.
ఉదయం 8.30గంటలకు మేళతాళాలతో వేదమంత్రాల నడుమ దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న వేదపండితులు, అర్చకులతో కలిసి యాగశాలపైకి కలశంతో చేరుకున్నారు.
ముందుగా నిర్ణయించిన సుమూహుర్త సమయం 8.48 గంటలకు యాగశాల శిఖరానికి కలశస్థాపన జరిపారు. అనంతరం ఆ శిఖరానికి కలశాభిషేకం జరిగింది.
నూతన యాగశాలలో కుంభాభిషేకం తరువాత వాస్తుపూజ, క్షేత్రపాలకపూజ, యోగిని పూజ తదితర విశేషపూజలను నిర్వహించారు. యాగశాలలోనే 16 స్తంభాలకు కంకణధారణ చేసి విశేషార్చనలను జరిపారు.
ముందుగా గో మరియు గోవత్సానికి పూజలను నిర్వహించి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయించి , యాగశాల ప్రవేశం చేశారు.ఆ తరువాత గం. 11.12 ని.లకు వేదమంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో యాగశాల ప్రారంభోత్సవం జరిగింది.
యాగశాలలో హోమకుండానికి, అగ్నిమథన సామాగ్రికి ప్రత్యేకపూజలు నిర్వహించి హోమ కార్యక్రమాలు ఆచరించారు.
యాగశాల దాత బట్టా పర్వతయ్య శారదా దేవి దంపతులకు దేవస్థానం తరుపున కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అనంతరం శ్రీమతి బట్టా శారదా పర్వతయ్య సంకలనం చేసిన • హోమాలు – విశిష్టత’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.
యాగశాలను నిర్మించిన నరసరావుపేటకు చెందిన శిల్పి సోదరులు కర్రి శ్రీనివాసరావు, కర్రి ఉమామహేషన్లను సత్కరించారు.
*Coordination Meeting held With Kannada Devotees . E.O. S.Lavanna and others participated, exchanged various views.
- Vendi rathotsavam performed in the temple. E.O. and others participated in the event.