
శ్రీశైల దేవస్థానం: శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి గురువారం విరాళంగా బంగారు హారమును సమర్పించారు. కీ.శే కె. గాలయ్య జ్ఞాపకార్థం, శ్రీమతి కొండా సుధారాణి, (జోగులాంబ గద్వాల జిల్లా , తెలంగాణా) బంగారు హారమును ఇచ్చారు . నెమళ్ళతో కూడిన మహాలక్ష్మీడాలరుకు ముత్యాలు కలిగిన లక్ష్మీకాసుల కెంపులు, ఆకుపచ్చరాళ్ళతో కూడిన ఈ బంగారు హారం బరువు 56 గ్రాములు ఉందని దాతలు తెలిపారు.అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ హారము ను కార్యనిర్వహణాధికారి కి అందించారు.
దాతలకు వేదాశీర్వచనం చేసి శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందించారు.