
శ్రీశైల దేవస్థానం:శ్రీ భ్రమరాంబా అమ్మవారి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల ఊయల ప్రదేశంలో కళాత్మక ఆచ్ఛాదన (పై కప్పు) ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ లోని చైతన్యపురి వాస్తవ్యులు ఎం. నరసింహారెడ్డి, శ్రీమతి సంధ్యారాణి దంపతులు ఈ ఆచ్ఛాదనను నిర్మింపచేసారు.
ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రములలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవ జరుపుతారు.
దాతలు మాట్లాడుతూ ఆచ్ఛాదన నిర్మాణానికి సుమారు రూ. 6 లక్షల దాకా వ్యయం చేసినట్లుగా పేర్కొన్నారు.
దాతలకు వేదాశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందించారు.