సౌకర్యాల కల్పనలో అంతా సమన్వయంతో  విధులు నిర్వహించాలి

శ్రీశైల దేవస్థానం: వివిధ సౌకర్యాల కల్పనలో అంతా సమన్వయంతో  విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల  ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ (ఆసరా,  సంక్షేమం) ఎం.కె.వి. శ్రీనివాసులు,  దేవస్థానం కార్యనిర్వహణాధికారి  ఎస్.లవన్న  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో డి.పి.ఓ.  నాగరాజు నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీమతి శృతి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్యామల, స్థానిక తహశీల్దార్  రాజేంద్రసింగ్, పలు శాఖల అధికారులు,ఎయిర్ టెల్,  జియో సంస్థల ప్రతినిధులు, దేవస్థానం యూనిట్ ఆఫీసర్లు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశ ప్రారంభంలో ఈ ఓ మాట్లాడుతూ దేవస్థానం కల్పించిన  సౌకర్యాల గురించి వివరించారు.

ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, దర్శనం ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.

తరువాత జాయింట్ కలెక్టర్  ఎం.కె.వి. శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వశాఖలు, దేవస్థానం అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఉత్సవాలను నిర్వహించాలన్నారు.గత రెండు సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్  ఆయా ఏర్పాట్లపై అధికారులకు, ఆయా శాఖలకు పలు బాధ్యతలు అప్పగించారని, అందరు  పకడ్బందీగా ఆయా విధుల నిర్వహణలో నిమగ్నం కావాలన్నారు. గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, సిగ్నల్స్ సామర్థ్యాన్ని పెంచాలని బి.ఎస్.ఎన్.ఎల్ అధికారులకు, సమావేశంలో పాల్గొన జియో, ఎయిర్ టెల్ ప్రతినిధులకు సూచించారు. నడక మార్గంలో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీటి సరఫరా పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. అవసరమైన మేరకు వైద్యసేవలు అందించాలన్నారు. అవసరమైన ఔషధాలను ఆయా మెడికల్ క్యాంపులలో సిద్ధంగా ఉంచుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి  సోమశేఖర్ కు సూచించారు. ఇప్పటికే దేవస్థానం రూపొందించిన ప్రణాళికను అనుసరించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు.

ఎస్. లవన్న మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది  , జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలతో ఉత్సవాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ఉద్యోగులందరు  పరస్పరం సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందించాలన్నారు.ముఖ్యంగా క్షేత్రపరిధిలో శౌచలయాల నిర్వహణపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగిస్తూ క్షేత్రమంతా కూడా శుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. క్యూకాంప్లెక్స్ లో నిరంతరం మంచినీరు, బిస్కెట్లను అందిస్తుండాలన్నారు.  ఉదయం వేళలో వేడిపాలను అందజేస్తుండాలన్నారు. ముఖ్యంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి క్యూకాంప్లెక్స్ స్లో వేచివున్న భక్తులకు అల్పాహారాన్ని అందిస్తుండాలన్నారు.  క్యూలైన్లలో, ఆలయప్రాంగణంలోని క్యూలైన్లలో కూడా మంచినీటిని అందిస్తుండాలన్నారు.

దేవస్థానం అన్నదాన భవనములో భక్తుల రద్ది కనుగుణంగా అన్నప్రసాదాలను అందజేస్తుండాలన్నారు. దేవస్థానంలో పల పలుచోట్ల అన్నదానం చేస్తున్న స్వచ్ఛందసేవకులకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

భక్తులకు అవసరం మేరకు ముఖ్యంగా కాలిబాట మార్గంలో కూడా తగు వైద్యసేవలు అందిస్తుండాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.సోమశేఖర్ కు సూచించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులకు అవసరమైన మందులను దేవస్థానం నుంచి కూడా పొందాలని సూచించారు. వైద్యసేవలలో ఎటువంటి లోటు ఉండకూడదన్నారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు కాళ్ళబొబ్బలు వచ్చే అవకాశం ఉందని, అటువంటి వారి కోసం మెడికల్ క్యాంపుల వద్ద పూత మందులు ( ఆయింట్‌మెంట్లు) అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

కమాండ్ కంట్రోల్ రూములో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన సమయాలలో ఆయా సమాచారాన్నంతా కూడా ఉన్నతాధికారులకు చేరవేస్తుండాలన్నారు.

ముఖ్యంగా సిబ్బంది అందరు  సంయమనం కోల్పోకుండా ఉంటూ భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.