
శ్రీశైల దేవస్థానం: శ్రీ దత్తాత్రేయస్వామి వారికి గురువారం విశేష పూజలు జరిగాయి. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ముందుగా మహాగణపతి పూజను ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేసారు. త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. శ్రీశైల క్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.