
శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (09.01.2022) కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న ఆకస్మికంగా గంగాసదన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.భక్తులకు గదులు కేటాయించేటప్పుడు వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా పరిశీలించాల న్నారు. ముఖ్యంగా భక్తులందరితో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు.పారిశుద్ధ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా గదులు, కాటేజీలు ఖాళీ అయిన వెంటనే శుభ్రపర్చడం ఎంతైనా అవసరమన్నారు.ఏ ఒక్క భక్తుడి నుండి కూడా ఫిర్యాదు లేకుండా సమర్థవంతంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు.
గంగాసదన్ ప్రాంగణములో మరింతగా పచ్చదనాన్ని పెంపొందించాలని ఈ ఓ ఆదేశించారు. గంగాసదన్ పరిశీలన తరువాత కార్యనిర్వహణాధికారి కొబ్బరికాయల గోడౌనన్ను కూడా పరిశీలించారు.