
శ్రీశైల దేవస్థానం: పచ్చదనం పెంచాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక పరిశీలనలో భాగంగా ఈ రోజు (07.01.2022) కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార – పంచదార ముఖద్వారాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆయా వసతులను కల్పించాలన్నారు. అదేవిధంగా హఠకేశ్వరం, సాక్షిగణపతి వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాట్ల గురించి చర్చించారు.
ఫాలధార – పంచధార వద్ద శారదా చంద్రమౌళీశ్వర శంకర మందిరం ముందు భాగాన ఫ్లోరింగ్ వేయాలని ఆదేశించారు.
అనంతరం హఠకేశ్వరం, సాక్షిగణపతి ఆలయం వద్ద శౌచలయాలు (మూత్రశాలలు, మరుగుదొడ్లు) ఏర్పాటు విషయం ఈ ఓ చర్చించారు. పచ్చదననాన్ని పెంపొందించే భాగంగా హఠకేశ్వర ఆలయ ప్రాంగణములో మరిన్ని పూలమొక్కలను పెంచాలని సంబంధికులను ఆదేశించారు.ముఖ్యంగా బిల్వం, కదంబం, ఉసిరి మొదలైన మొక్కలను పెంచాలన్నారు. హఠకేశ్వరం వద్ద గల కుండాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ లాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.