
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం ఈ రోజు (05.01.2022) డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయ కమిషనర్ (ఇంచార్జి) సహాయ కార్యనిర్వహణాధికారి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.
దేవస్థానం పరిపాలనా విభాగం లోని సమీక్షా సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమం లో పలువురు భక్తులు కార్యాలయానికి ఫోన్ ద్వారా పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో పలువురు భక్తులు సాయంకాల వేళలో కూడా గంట పాటు స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మరికొంత మంది భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమ వివరాలను గురించి ముందస్తుగానే విస్తృత ప్రచారం కల్పించాలని మరికొంత మంది భక్తులు కోరారు.
సహాయ కమిషనర్ (ఇంచార్జి) మాట్లాడుతూ ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు.
ఈ కార్యక్రమం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.