శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (02.01.2022) శ్రీమతి జె. మాధురి, నంద్యాల బృందం భక్తిరంజని కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి భక్తిరంజని కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమం లో గజాననయుతం, గజవదనా బేడువే, శంభోమహాదేవ, శివపంచాక్షరీ, మహాదేవ శివశంభో, శివశివ భవభవ, జయ జయ దుర్గే, స్మరణం ఒందే సాలదే, ..శంబో… శివశంభో, శివ శివయనరాదా తదితర గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి మృదంగ సహకారాన్ని వీరాస్వామి, ఓకల్ జె. మాధురి అందించారు.
రెండవ కార్యక్రమం గా ప్రగతి నృత్యనికేతన్, అనంతపురం జిల్లా వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, వందేశివమ్ శంకరం, శివ శివ శంకర, అఖిలాండేశ్వరీ తదితర గీతాలకు ప్రగతి, వైష్ణవి, వర్ష, బి. అగస్త్య, టి. ప్రసన్విత, తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (03.01.2022) న సాయిసురేఖ డాన్స్ అకాడమి, విశాఖపట్నం వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
*Talasila Raghuram ,MLC, AP., visited Srisaila temple today. E.O. and others received with temple maryaadha.
* Bayalu Veerabhdraswamy Paroksha seva performed in the temple.E.O. and others participated in the event.