తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రజలలో అవగాహన పెంచేలా, మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేలా వార్తలు, కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు, రిపోర్టర్లకు ‘హరితమిత్ర’ అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హరితహారం కార్యక్రమంపై మంచి వార్తలు రాసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు, మంచి అధ్యయనం చేసి, విశ్లేషణ చేసే ఆర్టికల్స్ కు, ఎడిటర్స్ కు, ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించిన మీడియా సంస్థలకు అవార్డులు ఇస్తామని సిఎం చెప్పారు.
ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇస్తామన్నారు. మొక్కలు నాటి, వాటిని రక్షించి వాతావరణంలో చల్లదనం, భూగోళంలో పచ్చదనం పెంచాల్సిన అవసరాన్ని మీడియా ప్రజలకు వివరించాలని సిఎం కోరారు. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం అందించే బహుళ ప్రయోజనాలను ప్రజలకు విడమరిచి చెప్పాలని కోరారు.
Chief Minister Sri K. Chandrashekar Rao has instituted ‘Harihta Mitra’ Award for journalists, print and electronic media houses in recognition of their meritorious contribution to spread awareness on ‘Haritha Haram’ programme. The Award will be presented on Independence Day starting this year.