
శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో ఈరోజు (10.12.2021) శ్రీ నటరాజ కళాక్షేత్ర, నెల్లూరు వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరస్తుతి, మహాదేవసుతం,అర్థనారీశ్వరం, శివ శివ భవభవ, శంబో తదితర గీతాలకు కె. త్రిపుర నిఖిత, వి అశ్రిత, టి. గీతాకృష్ణ, సాయిసిరి సుశ్మిత, ఎం. నిత్య, పి. కీర్తన, వేదాభిషిణి తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (11.12.2021) శ్రీ నటరాజ డ్యా న్స్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.