
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (24.11.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,56,20,325/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించారు.
అదేవిధంగా 1435 యు.ఎస్.ఏ డాలర్లు, 70 కెనడా డాలర్లు, 10 యూరోస్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేసారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఈ ఓ తెలిపారు.