*Award for 3 star garbege free city by secretary of govt of India Swachh Survekshan *
• ఢిల్లీలో అవార్డ్ ను స్వీకరిoచిన కడప నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్, ప్రస్తుత శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న*
ఢిల్లీ:గార్బేజ్ ఫ్రీ సిటీ గా కడప నగరపాలక సంస్థ మూడు స్టార్ రేటింగ్ (3 స్టార్) పొందింది. ఈ మేరకు ఈ రోజు (20.11.2021) న ఢిల్లీలో జరిగిన “స్వచ్ఛ సర్వేక్షణ్-2021” కార్యక్రమoలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న (కడప నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్) ఈ అవార్డ్ ను స్వీకరించారు.
భారత ప్రభుత్వ కార్యదర్శి చేతులమీదుగా ఎస్.లవన్న ఈ అవార్డ్ ను స్వీకరిoచారు. దేశవ్యాప్తంగా జరిపిన సర్వే ద్వారా ఎంపిక అయిన నగరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కడపతో పాటు మరో మూడు నగరాలకు కూడా ఈ అవార్డ్ లభించింది. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగర పాలక సంస్థలు కూడా ఈ అవార్డ్ ను పొందాయి.
కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది భారతదేశంలోని నగరాలు మరియు పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ద్యం వార్షిక సర్వే. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రారంభించారు.
“స్వచ్ఛ సర్వేక్షణ్” ప్రధానoగా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న లక్ష్యంగా ఉంది.
స్వచ్చ భారత్ లక్షంలో పెద్ద ఎత్తున పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, చెత్త రహిత, బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం చేపట్టిన చర్యలు, స్వచ్చ భారత్ పై అందరిలో అవగాహన కల్పించడం మొదలైన అంశాలు ఆధరంగా సర్వే లక్ష్యం.