
-
- శ్రీశైల దేవస్థానం: శ్రీలలితాంబిక దుకాణ సముదాయం షాపుల కేటాయింపు ఉన్నత
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పారదర్శకంగా చేస్తామని దేవస్థానం ఈ ఓ ఎస్ .లవన్న తెలిపారు.
ఈ విషయమై దుకాణదారుల సహకారం ఎంతైనా అవసరమని ఈ ఓ స్పష్టం చేసారు.ఈ రోజు (13.11.2021) న సాయంత్రం దేవస్థాన కార్యాలయ సమావేశ భవనం లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ ఓ ప్రధానంగా ఈ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఈ ఓ విడుదల చేసిన ప్రత్యేక నోట్ చదువరుల సౌకర్యార్థం యథాతథంగా ఇది.
- శ్రీ లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణమునకు దారితీసిన యథార్థాలు 1. శ్రీశైల దేవస్థానములో మాస్టర్ ప్లాన్ అనుగుణంగా అభివృద్ధి చేయడానికి రథశాల నుండి పోస్టాఫీసనకు మరియు రథశాల నుండి పాతాళగంగ రహదారి వరకు ( నందిమండపం వరకు) గల మార్గములో భక్తులకు రాకపోకలకు అవాంతరములు లేకుండా ఉండుటకుగాను సదరు రహదారిని విస్తరించవలసియున్నది.
- దుకాణదారుల కోరిక మేరకు సిద్ధరామప్పషాపింగ్ కాంప్లెక్స్ నందు సుమారు 20 కోట్ల ఖర్చుతో
G+2 Floors గా సుమారు 252 దుకాణములతో నిర్మించుట జరిగినది.
- కానీ, సదరు సిద్ధరామప్ప దుకాణ సముదాయ నిర్మాణము పూర్తి అయిన పిదప దేవస్థానము వారిచే
నిర్మించబడిన సిద్ధరామప్ప దుకాణ సముదాయము నందు, వ్యాపారము నిర్వహించుటకు అనువుగా
లేదని ప్రధాన దేవాలయమునకు దూరముగా ఉన్నదని కారణములతో సిద్ధరామప్ప దుకాణ
సముదాయనకు వెళ్ళుటకు నిరాకరించి, ప్రధాన దేవాలయమునకు సమీపములో మరియొక
దుకాణముల సముదాయమును కేవలము Ground Floor గా మాత్రమే ఉండునటుల నిర్మాణము
చేయవలసినదిగా అభ్యర్ధించి యున్నారు.
- ఈ పరిస్థితులలో, ప్రధాన దేవాలయమునకు సమీపములో గల లలితాబజారు ప్రాంతములో 70 ఇతర
దుకాణ దారులను ఒప్పించి, వారి దుకాణముల నుంచి ఖాళీ చేయించి, సదరు దుకాణ దారులకు
సిద్దరామప్ప దుకాణ సముదాయమునందు దుకాణములు కేటాయించుట జరిగినది.
- తదుపరి, ప్రధాన దేవాలయమునకు సమీపములో గల లలితాబజారు ప్రాంతములో సుమారు
రూ. 9 కోట్ల ఖర్చుతో శ్రీలలితాంబికాషాపింగ్ కాంప్లెక్స్ పేరున దుకాణముల సముదాయము ఫిబ్రవరి
– 2019 న నిర్మాణము పూర్తి చేయబడినది.
- కానీ కొంతమంది కోర్టును ఆశ్రయించి దేవస్థానము వారు చర్చల ప్రకారము (ప్రైవేటు నెగోషియేషన్)
ప్రకారము లీజు పద్ధతిపై దుకాణముల కేటాయింపు జరుపుతున్న చర్యలపై విముఖత వ్యక్తం చేశారు.
కొందరు దుకాణ దారులు బహిరంగవేలము ద్వారా సదరు దుకాణముల కేటాయింపు జరగవలెనని
గౌరవ ఉన్నత న్యాయస్థానమును ఆశ్రయించుట జరిగినది.
- తదుపరి, గౌరవ ఉన్నత న్యాయస్థానము వారి ఆదేశములు అనుసరించి అనేక రకములైన అడ్డంకులు
అధిగమించి నియమ నిబంధనల ప్రకారము జరిపిన బహిరంగ వేలము ద్వారా జరుపుటకు
నిర్ణయింపబడినది. కానీ పలు దుకాణదారులు ఆమోదయోగ్యము కానీ అంశములతో
బహిరంగవేలము నందు పాల్గొనుటకు సుముఖంగా లేరు.
- మరి కొందరు దుకాణదారులు బహిరంగ వేలము జరగకుండా
ఉండుటకు గౌరవ ఉన్నత న్యాయస్థానమున వ్యాజ్యములు దాఖలు చేయగా, బహిరంగ వేలము జరపవచ్చునని, కానీ, దుకాణముల కేటాయింపు పై తుది నిర్ణయము చేయరాదని గౌరవ ఉన్నత న్యాయస్థానము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణలోనికి తీసుకొని తేది.16.08.2019 నుండి తేది.18.8.2019 వరకు
జరిపిన బహిరంగ వేలము జరుపబడింది. అట్లు జరిపిన బహిరంగ వేలము కొన్ని అవాంతరములను
పరిశీలించి, శ్రీయుత కమీషనర్, దేవదాయ ధర్మదాయ శాఖ వారు సదరు బహిరంగవేలమును రద్దు
చేయుచూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు. కాగా, జరిగిన సదరు బహిరంగవేలములో పాల్గొని
హెచ్చు పాటుదారులుగా ఉన్న వారిలో కొందరు అనగా 42 bidders, శ్రీయుత కమీషనర్, దేవదాయ
ధర్మదాయ శాఖ వారి రద్దు ఉత్తర్వులను, సవాల్ చేస్తూ గౌరవ ఉన్నత న్యాయ స్థానమున
వ్యాజ్యములు దాఖలు చేయుట జరిగినది.
- ఈ ప్రక్రియలో దేవస్థానమునకు 2015 నుండి 2021 వరకు రెండు పర్యాయములు అద్దె పెంపుదల
జరుగలేదు. ( 33 % + 33% ] 66% ప్రస్తుతం ఉన్న అద్దె పైన పెంపుదల వలన సుమారు
రూ. 10,50,000/-లు ప్రతిమాసము సుమారు రూ. 8 కోట్లు నష్టము వాటిల్లింది. శ్రీ సిద్దరామప్ప
కాంప్లెక్స్ మరియు లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికిగాను రూ. 29 కోట్లు, వాటిపైన అద్దె
రూపమున మరియు వడ్డీ రూపమున సుమారు రూ. 15 కోట్లు ఈ విధంగా మొత్తంగా సుమారు
రూ. 55 కోట్లు దేవస్థానానికి నష్టం వాటిల్లింది.
- కాగా ఈ రోజు (13.11.2021) దుకాణదారులు మరియు పిటిషనర్ల వారితో జరిపిన సమావేశములో
గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను వివరించి చెప్పడం జరిగింది.
కాగా ఈ సందర్భంగా పలు చర్యలు చేపట్టాల్సి వుంది
- శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక్కొక్క దుకాణదారుడికి ఒక్క షాపు మాత్రమే
కల్పించాలని నిర్ణయించబడింది.
- బినామీదారులకు దుకాణాలు కేటాయించే అవకాశం లేదు.
- ప్రస్తుతం గల తాత్కాలిక షాపులను తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేయబడుతాయి.
- గౌరవ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాలను అనుసరించే దుకాణాల కేటాయింపు ప్రక్రియ
కొనసాగుతుంది.
- ప్రస్తుతం ఖాళీ చేయబడే దుకాణాలు ఎవరికి కూడా కేటాయించబడవు. వాటిని పూర్తిగా
తొలగించడం జరుగుతుంది.
- శ్రీలలితాంబిక దుకాణసముదాయములో షాపుల కేటాయింపులో గౌరవ ఉన్నత
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పారదర్శకంగా కేటాయించడం జరుగుతుంది.
ఈ విషయమై దుకాణదారుల సహకారం ఎంతైనా అవసరం.
- శ్రీలలితాంబిక దుకాణసముదాయములో 30 దుకాణాలు చెంచుగిరిజనులకు కేటాయించబడుతాయి. వీరు వ్యాపార నిర్వహణకు బ్యాంకులోను మంజూరు చేయు విషయములో కూడా దేవస్థానం సహకరిస్తుంది.
- శ్రీలలితాంబిక దుకాణసముదాయము నందు చదరపు అడుగునకు కనీసం రూ.128/
లుగాను, కనిష్టంగా రూ.320/-లు గాను ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది.దుకాణదారులు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ విషయమై దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టబడుతాయి. i. ఈ రోజు జరిగిన సమావేశములో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని
కోరడం జరిగింది.