
శ్రీశైలదేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో లడ్డు ప్రసాద విభాగం లో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్థూ 26.08.2021న ఆకస్మికంగా మృతి చెందిన టి. వీరన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
శ్రీశైల దేవస్థానంలో ఒప్పంద ,పొరుగు సేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒక రోజు వేతనం మొత్తాన్ని రూ.1,71,333/-లు ఈ రోజు (11.11.2021)న టి. వీరన్న కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ మేరకు ఈ రోజు డిమాండ్ డ్రాఫ్ట్ ను టి. వీరన్న భార్య శ్రీమతి టి. బాలమ్మ కు కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఒప్పంద, పొరుగు సేవల యూనియన్ ప్రెసిడెంట్ బాలాజీనాయక్ , పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.