
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (08.11.2021)న రాయన శ్రీనివాసరావు,శ్రీ నటరాజ నృత్యాలయం, విజయవాడ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో మూహికవాహన, శివకైవారం, వినాయక కౌత్వం, అష్టాదిక్పాలక ఆరాధన త్రిపురహారం, కుంభహారతి తదితర గీతాలకు దుర్గాశ్రీ, తిలోత్తమ, వి. ఐశ్వర్య, ఎం. స్వర్ణలత, ఎస్.ప్రగతి, తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
శ్రీమతి నామిరెడ్డి జాహ్నవి,నాట్యంజలి డాన్స్ అకాడమి, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమములో గణపతిస్తుతి, గణపతి కౌత్వం, గణపతితాళం, అయిగిరినందిని, ఓం శంభో,జతిశ్వరం, తరంగం తదితర గీతాలకు నందిని, హర్షిణి, సాయిసుధ, చంద్రహాసిని, వర్షిత, నిహారిక, బృంద, నిరుపమ, తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కార్తీకదీపోత్సవం పై ప్రవచన కార్యక్రమం కార్తికమాసం ధార్మిక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు (08.11.2021) కార్తిక మొదటి సోమవారం సందర్భంగా పుష్కరిణీ వద్ద కార్తీకదీపోత్సవంపై ప్రవచన కార్యక్రమం జరిగింది.
ఈ ప్రవచన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్తీకదీపోత్సవంపై ప్రవచనం చేసారు.
రేపు (09.11.2021)న శ్రీమతి బి.వి.యన్.రామలక్ష్మీ నంద్యాల వారిచే కచేరి, టి. సందీప్ కుమార్, విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.