కె.సి.అశోక్ కుమార్ , ఖమ్మం బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (31.10.2021) న కె.సి.అశోక్ కుమార్ , ఖమ్మం బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమములో గణపతిస్తుతి, పార్వతి మనోహరి, పాహిమాం శ్రీ రాజరాజేశ్వరీ. అమ్మా దేవీ మూకాంబిక, సంగీతమే అమరసళ్లెపమే, తిల్లాన, హర హర మహదేవ, జైజై శంకర తదితర గీతాలకు కోమలిశ్రీ , కోవిధశ్రీ , కార్తీకనాయర్, మహేష్ చంద్ర, నవనీత్,యశ్వంత్,లక్ష్మి ప్రసన్న ,శృతి, సరిత, వీణ, రాధిక, వీణ, లక్ష్మి ప్రసన్న తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లా లోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (01.11.2021) శ్రీమతి యస్. పెద్దపుల్లమ్మ, గాజులపల్లి గ్రామం, మహానంది మండలం కర్నూలు జిల్లా వారిచే భక్తిరంజని కార్యక్రమం, సాయికుమార్, శ్రీనటరాజ నృత్యకళాశాల, నందికొట్కూరు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
Post Comment