నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణం వైభవంగా నిర్వహించాలి-కలెక్టర్ పి. కోటేశ్వర రావు
కర్నూలు, అక్టోబర్ 30 :-నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలపై జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు సమావేశం నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కె. బాలాజీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డిఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ…. రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1 వ తేదిన సునయన ఆడిటోరియంలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ ఓ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వేదికను సంప్రదాయంగా, పచ్చదనం విరిసేలా అలంకరించాలన్నారు..తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి, కొండారెడ్డి బురుజు సర్కిల్ లోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్రాఫ్ట్ మేళా, సంప్రదాయపు వంటలు, రంగవల్లులు తదితర కార్యక్రమాలతో పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గౌరవ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు డిఆర్ఓ, కర్నూలు ఆర్డీవో తో కలిసి తన ఛాంబర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించి వేడుకలను జయప్రదం చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.
Post Comment