వేల వేల దండాలయ్య.. శ్రీనటరాజ కళానృత్య కళాశాల, శ్రీశైలం నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం  నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (28.10.2021)న  శ్రీనటరాజ కళానృత్య కళాశాల, శ్రీశైలం వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భరటనాట్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో గణపతిస్తుతి, నందివాహన, హర హర మహదేవ, జైజై శంకర, నా స్వామి మల్లన్న, రారా మల్లయ్యస్వామి, మట్టిని తీసి బొమ్మను చేసి, వేల వేల దండాలయ్య తదితర గీతాలకు జి. పూజశ్రీ, హెచ్. యశశ్విని, జి.విద్య, బి. ధనుశ్రీ, ఎన్. వింధ్యశ్రీ తదితరులు నృత్యప్రదర్శనను చేసారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని,  ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

రేపటి నిత్య కళారాధన

రేపు (29.10.2021)న  శ్రీ వనపర్తి సత్యం స్వామి, వనపర్తి వారి బృందం, భక్తిరంజని కార్యక్రమం  సమర్పిస్తుంది.

print

Post Comment

You May Have Missed