అయిగిరినందిని …సంప్రదాయ గీతాలకు అనుగుణ నాట్య ప్రదర్శన

 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (22.10.2021) న ప్రణవి, మానస స్కూల్ ఆఫ్ డ్యా న్స్, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆకట్టుకుంది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భరటనాట్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో మూషికవాహన, అంబా భవాని, బ్రహ్మమురారి, హరసుత గజముఖ, అయిగిరినందిని తదితర గీతాలకు సజ్జసాయి మౌనిక, వైష్ణవి, లాస్య, సాయి శ్రీనిధి, బిల్వబిందారెడ్డి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.

 ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని,  ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

| రేపటి నిత్య కళారాధన

రేపు (23.10.2021)న  జి. మానస, నంద్యాల వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

*Uyala Seva, Ankalamma Visesha puuja performed in the temple.

print

Post Comment

You May Have Missed