కార్తిక మాసం మొదటివారంలోగా చాలా పనులు పూర్తి కావాలి-ఈ ఓ లవన్న

 శ్రీశైల దేవస్థానం:  కార్తిక మాసం మొదటివారంలోగా చాలా పనులు పూర్తి కావాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఈ రోజు (21.10..2021) న  కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న పలు దేవస్థాన భవనాలను పరిశీలించారు.

మల్లికార్జున సదనం, గంగా–గౌరీ సదనం , పాతాళేశ్వర సదనం, చండీశ్వర సదనం, అంబా సదనం మొదలైనవాటిని ఈ ఓ  పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ దేవస్థానం భవనాలకు అవసరమైన చోట్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.ముఖ్యంగా అన్ని భవనాలలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ సజావుగా వుండేవిధంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతుండాలని ఆదేశించారు.

 వసతి సదుపాయాలకు సంబంధించి భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఈ ఓ  సూచించారు.

 దేవస్థానం భవనాల వద్ద పూజా వివరాలు, సేవలు, గదులకు సంబంధించి అద్దె వివరాలను భక్తులకు తెలిసేవిధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులన్నీ కూడా కార్తికమాసం మొదటివారంలోగా పూర్తి కావాలని  ఈ ఓ ఆదేశించారు.

దేవస్థానం భవనాల వద్ద పారిశుద్ధ్య పనులను కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed