శుభ ప్రదాయిని కాత్యాయని
శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన ఈ రోజు (12.10.2021) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.
అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం ప్రత్యేకం.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు ప్రత్యేకం.
కుమారి పూజ దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు . కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.
కాత్యాయని అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో , నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కాత్యాయని స్వరూపంలో అలంకరింపజేయడంప్రత్యేకం.
నవదుర్గలలో ఆరవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయ హస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాత్యాయనిదేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చునని చెప్పబడింది. ఇంకా శ్రీ కృష్ణుని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారినే పూజించారట.
కాత్యాయని ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా హరింపబడుతాయంటారు.
| హంసవాహనసేవ:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు హంసవాహనసేవ ప్రత్యేకం.
ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, హంస వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ప్రత్యేకం.
*Kumara Swamy Puuja ,Bayalu veerabadra swamy puuja,Nandeeshwara Puuja performed in the temple.
* K. Mahesh , Bangalore, Karnataka State donated Rs.One Lakh For Annadanam scheme.
Post Comment