వసతి గృహాల  పిల్లలలో వ్యక్తిగత విలువలు నేర్పండి-కలెక్టర్ పి. కోటేశ్వర రావు

*ఈ రోజు ఉదయం (01-10-2021) న  కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లకు చెందిన జిల్లా అధికారులు, ఏయస్ డబ్ల్యూఓ, ఏబిసిడబ్ల్యుఓ, ఏటిడబ్ల్యూఓలతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు *

కర్నూలు, అక్టోబర్ 01 :-సంక్షేమ వసతి గృహాల పిల్లలను మంచి ప్రయోజకులుగా తయారు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ల అధికారులను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు.

శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లకు చెందిన జిల్లా అధికారులు, ఏయస్ డబ్ల్యూఓ, ఏబిసిడబ్ల్యుఓ, ఏటిడబ్ల్యూఓలతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు.

సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, డి ఎస్ డబ్ల్యూఓ చింతామణి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ బాషా, డిటిడబ్ల్యూఓ రమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ…. సంక్షేమ వసతి గృహాల్లో చదివే పిల్లలు పేద పిల్లలని వారిపట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత చూపిస్తూ మన పిల్లల లాగే బాగా చూసుకోవాలని  సూచించారు. సంక్షేమ వసతి గృహాలలో మంచి వసతులతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన భోజనం మెనూను తప్పక పాటిస్తూ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమాజానికి పనికి వచ్చే విధంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అన్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో విద్యార్థులు భోజనం చేసే సమయంలో వారిని ఆప్యాయతతో పలకరిస్తూ మంచి విలువలు నేర్పాలన్నారు. తన ఇంటి కన్నా హాస్టల్ బాగా ఉంది అనిపించేలా ఆ వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలన్నారు. ఈ అవకాశం ఎవరికీ రాలేదని, అది మీకు మాత్రమే వచ్చిందని, దేశం గర్వించదగ్గ విధంగా పిల్లలను ప్రయోజకులుగా తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలలో ఎంత మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు… వంటి వివరాలను సోషల్ వెల్ఫేర్ డిడి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.