దసరా మహోత్సవాల ప్రారంభంరోజు నుంచి సామాన్య భక్తులకు స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం

 శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు ఉచితంగా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు దేవస్థానం నిర్ణయించింది.

దసరా మహోత్సవాల ప్రారంభమయ్యే అక్టోబరు 7వ తేదీ నుంచి సర్వ భక్తులకు ఉచితంగా  స్వామివార్ల స్పర్శదర్శనం ఉంటుంది.

గతంలో వలనే వారంలో నాలుగురోజులపాటు అనగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు సర్వదర్శనం క్యూలైన్ భక్తులకు ఉచితంగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించారు. ఈ నాలుగురోజులలో మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3.30 గంటల వరకు ఉచితంగా భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనాన్ని కకల్పిస్తారు 

కాగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావలసి వుంటుంది.

సంప్రదాయ వస్త్రధారణలో పురుషులు పంచ,  కండువాను, మహిళలు చీర మరియు రవిక, లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్ లను ధరించవలసివుంటుంది.

సంప్రదాయవస్త్రధారణ గురించి భక్తులలో మరింత అవగాహన కల్పించేందుకు తగు చర్యలు కూడా తీసుకుంటారు.

ఈ విషయమై ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు.

అదేవిధంగా క్షేత్రపరిధిలో మరిన్నిచోట్ల కూడా సంప్రదాయ వస్త్రధారణ తెలియజెప్పే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

print

Post Comment

You May Have Missed