అధికారులకు దశ దిశ నిర్దేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు, సెప్టెంబర్ 04:-ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వానికి ఎంపీడీఓలు, తహసీల్దార్ లు రెండు కళ్ళు లాంటివాళ్ళని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అన్నారు.

శనివారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కర్నూలు డివిజన్ స్థాయిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు- ఇంటి నిర్మాణాల పురోగతి, ఇంటి పట్టాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వ్యవసాయ శాఖ, సర్వే మరియు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, కోవిడ్ – 19 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, డి ఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకు వచ్చిందని, ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో అది నెరవేర్చేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నాణ్యమైన సేవలు అందించేందుకు అదికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులు అందరూ సీరియస్ గా తీసుకుని కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాల్లోనూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. న

*సెప్టెంబర్ 6 వ తేదీన (సోమవారం) కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “స్పందన” ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం :-

మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం

ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోండి :-

కర్నూలు, సెప్టెంబర్ 4:- సెప్టెంబర్ 6 వ తేదీన (సోమవారం) ఉదయం 10 గంటల నుండి కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

జిల్లా అధికారులు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో, మండల స్థాయి అధికారులందరూ తహసీల్దార్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు

ఫిర్యాదుల స్వీకరణ అనంతరం స్పందన సమస్యల పరిష్కారం పై జిల్లా అధికారులతోనూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు

కోవిడ్ నేపథ్యంలో అర్జీదారులు తప్పకుండా మాస్కులు ధరించి హాజరు కావాలని, స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.