అన్నింట్లో కర్నూలు జిల్లా మొదటి, రెండో స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు, సెప్టెంబర్ 02:-ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పురోగతి కనిపించాలని, ఆదోని డివిజన్ లో మొదటి సారి సమీక్ష నిర్వహిస్తున్నామని, రెండవసారి సమీక్షలో పురోగతి సాధించకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ,అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు హెచ్చరించారు.
గురువారం ఆదోని శ్రీనివాస కళ్యాణం మండపంలో ఆదోని డివిజన్ స్థాయిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు- ఇంటి నిర్మాణాల పురోగతి, ఇంటి పట్టాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వ్యవసాయ శాఖ, సర్వే మరియు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, కోవిడ్ – 19 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రవేశపెట్టిన పథకాలలో జిల్లాను మొదటి, రెండవ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు.
ప్రతి సెంటు ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు కావాలి:
కర్నూలు/ఆదోని, సెప్టెంబర్ 02 :-రైతు భరోసా, పంటల బీమా, కనీస మద్దతు ధర, ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం, రైతు భరోసా, బీమా, తదితర ప్రభుత్వ పథకాలు రైతులకు అందాలంటే పంట నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం ఆదోని శ్రీనివాస కళ్యాణం మండపంలో ఆదోని డివిజన్ స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ…రైతులు సాగు చేసే ప్రతి పంట వివరాలను ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:
కర్నూలు /ఆదోని, సెప్టెంబర్ 02 :-సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు వైద్యాధికారులను ఆదేశించారు.
గురువారం ఆదోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆదోని డివిజన్ స్థాయిలో అధికారులతో సీజనల్ వ్యాధుల పై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య, ఆదోని డివిజన్ స్ధాయి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్దారించుకోవాలన్నారు. వర్షాకాలం అయినందున హెల్త్ క్యాంపుల ద్వారా గ్రామాలు, అర్బన్ ప్రాంతాల్లో పర్యవేక్షించాలన్నారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పారిశుధ్య చర్యలు తీసుకునేలా చూడాలని తెలిపారు. ఎక్కడైన మలేరియా, డెంగ్యూ వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా వుంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్, మలాథియన్, పైరేత్రియం, అబేట్ వంటి మందులు స్ప్రే చేయడం, ఫాగింగ్ నిర్వహణ చేపట్టాలన్నారు.
కోవిడ్ ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, వ్యాక్సినేషన్ పక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో సమర్థవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల ఉన్న వారందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకునేల మోటివేషన్ చేయాలన్నారు. మొదటి డోసు వేయించుకున్న వాళ్ళందరికీ రెండవ డోసు దగ్గర పడుతుందని వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.
Post Comment