రాతి కట్టడం తో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లో రాతి యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం అమ్మవారి ఆలయం లో ఉన్న యాగశాల  ప్రదేశంలోనే  రాతి  కట్టడం తో నూతనయాగశాల నిర్మిస్తున్నారు. దాత సహకారంతో  ఈ నిర్మాణం చేపట్టారు.

కాగా ఈ రోజు (29.08.2021) న ఉదయం ఈ యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.

ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పూర్వపు కార్యనిర్వహణాధికారి  కె.ఎస్. రామరావు , దాతలు  బట్టా పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి,  దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి ముందుగా యాగశాల నిర్మాణ స్థలం లో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు నిర్మాణ సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేసారు. ఆ తరువాత పుణ్యాహవచనం, నవగ్రహమండపారాధన, వాస్తుమండపారాధన, వాస్తుపూజ, శంకపూజ,యంత్ర ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న మాట్లాడుతూ ఈ యాగశాలను  బట్టా పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి, హైదరాబాద్ వారు నిర్మిస్తుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. రాతికట్టడంగా కృష్ణశిలతో ఈ యాగశాల నిర్మిస్తున్నారన్నారు. ఒకేసారి 50 మంది దంపతులు హోమాలను నిర్వహించేందుకు వీలుగా ఈ యాగశాల నిర్మాణం ఉంటుందన్నారు.

తరువాత నిర్మాణదాతలు పర్వతయ్య మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల కటాక్షముతోనే తమకు నూతన యాగశాల నిర్మింపజేసే అవకాశం లభించిందన్నారు.

print

Post Comment

You May Have Missed