
కోవిడ్ ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గం :-
వ్యాక్సినేషన్ పక్రియపై ప్రత్యేక దృష్టి సారించండి :-
మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కర్నూలు జిల్లాకు కేటాయించిన వంద శాతం వ్యాక్సినేషన్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలి :-
టెలీ కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-
కర్నూలు, ఆగస్టు 28:-కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, వ్యాక్సినేషన్ పక్రియ పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాకు కేటాయించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 18 నుంచి 44 సంవత్సరాల వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై మున్సిపాలిటీ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్ లతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య, మున్సిపల్ కమిషనర్ లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ….అధికారులందరూ సమన్వయంతో సమర్థవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 18 నుంచి 44 సంవత్సరాల ఉన్న వారందరికీ వ్యాక్సిన్ తీసుకునేలా మొటివేషన్ చేసి వ్యాక్సిన్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్ లు ప్రత్యేక చొరవ చూపి ఎట్టిపరిస్థితిలో జిల్లాకు కేటాయించిన కోవిడ్ టీకాలను పూర్తి చేయాలన్నారు.
అంతకుముందు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్ మున్సిపాలిటీ, మండలాల వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు.మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కర్నూలు జిల్లాకు 1,10,000 డోసులు కేటాయించారు.