
👉🏻ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి :-
👉🏻యాంటీ హైజాకింగ్ రూమ్ సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం స్టాండర్డ్ ప్రొసీజర్ ఆపరేషన్ (SOP) నియమ నిబంధనలను తప్పక పాటించండి :-
👉🏻ఎప్పుడు ఏమి జరిగినా అలర్ట్ గా ఉండండి :-
👉🏻ఏరో డ్రోన్ కమిటీ (ACM) ,ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (AEMC) జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు :-
కర్నూలు, ఆగస్టు 27 :-ఓర్వకల్లు/కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకల భద్రతను పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఎయిర్ పోర్ట్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఏరో డ్రోన్ కమిటీ (ACM) , ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (AEMC) సమావేశాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులతో పాటు సంబంధిత కమిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, చీఫ్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణయ్య, డిఈ మధుసూదన్, ఎయిర్ పైడ్ మేనేజర్ అవిజిత్, గతంలో పనిచేసిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాస్ మండల్, ఎయిర్ పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఓర్వకల్లు/కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యాంటీ హైజాకింగ్ రూమ్ సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం స్టాండర్డ్ ప్రొసీజర్ ఆపరేషన్ (SOP) నియమ నిబంధనలను తప్పక పాటించడంతో పాటు ఎప్పుడు ఏమి జరిగినా అలర్ట్ గా ఉండాలన్నారు. విమాన రాకపోకలకు ఆటంకం కలిగించే పక్షులు, జంతువులు అడ్డుపడకుండా…. విమానాశ్రయం చుట్టుపక్కల ఉండే పది కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలలో జంతువులు, జంతు కళేబరాలను పడేయడం, వ్యర్థ పదార్థాలను పడేయడం వంటివి చేయకుండా ఉండే విధంగా జిల్లా పంచాయతీ అధికారితో కలిసి విమానాశ్రయ పరిసర ప్రాంతాల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ లోపాలు ఏమైనా ఉంటే వెంటనే సరిదిద్దుకొని జిల్లా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసి సహాయ సహకారాలు తీసుకొని ప్రయాణీకుల విమాన రాకపోకలు భద్రతకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి, ఓర్వకల్లు తహసీల్దార్ ఇరువురు కలిసి టీమ్ గా వెళ్లి ఎయిర్ పోర్ట్ ను సందర్శించి… ఎయిర్ పోర్టు అధికారులు సూచించిన ప్రకారం వారితో కలిసి గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలన్నారు. ఎయిర్ పోర్ట్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులును జిల్లా కలెక్టర్ సూచించారు. ఎయిర్ పోర్టు కు సంబంధించి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎయిర్ పోర్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
అంతకుముందు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఏరో డ్రోన్ కమిటీ (ACM) మరియు ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (AEMC) పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.