స్వీయ క్రమశిక్షణతో సజావుగా విధినిర్వహణ-శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్. లవన్న
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు ( 27.08.2021 ) న ఉదయం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. లవన్న కార్యాలయం లోని పలువిభాగాలను పరిశీలించారు. పరిపాలన, ఆలయం, రెవెన్యూ, ఆడిట్, స్టేషనరీ, ప్రచురణలు మొదలైన విభాగాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి ఆయా విభాగాలలోని కార్యకలాపాలు, వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు మొదలైన వాటిని సంబంధిత విభాగాధిపతులను, పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కార్యాలయం లో వెంటనే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేయాలని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.ప్రతి విభాగం కూడా శుచిశుభ్రత పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. కార్యాలయ పనివేళలు ప్రారంభమయ్యేటప్పటికే కార్యాలయం శుభ్రపరిచే కార్యక్రమం పూర్తి కావాలన్నారు.కార్యాలయం లో మూమెంట్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. అధికారిక పనులపై సిబ్బంది ముఖ్యస్థావరములు విడిచి వెళ్లినప్పుడు సంబంధిత ప్రయాణ వివరాలను మూమెంట్ రిజిస్టరు లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో విధులు (ఫీల్డ్ విధులు) నిర్వహించే ఇంజనీరింగ్, ప్రజాసంబంధాలు, ప్రచారం మొదలైన విభాగాలకు చెందిన సిబ్బంది కూడా కార్యాలయం నుంచి క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు, తిరిగి కార్యాలయం చేరుకున్నప్పుడు సంబంధిత వివరాలను మూమెంట్ రిజిస్టరు లో పొందుపర్చాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.సిబ్బంది అందరు కూడా విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
ప్రతి ఉద్యోగి కూడా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. ఇటువంటి క్రమశిక్షణ వల్ల విధినిర్వహణ సజావుగా ఉంటుందన్నారు.
సనాతన ధర్మాచరణలో భాగంగా దేవస్థానంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి కూడా విధిగా తిలకధారణతో ( విభూతి, కుంకుమ లేదా గంధం ధరించి) ఉండాలన్నారు.ఆలయం లోకి ప్రవేశించే భక్తులంతా కూడా విధిగా విభూతిని ధరించేవిధంగా మరింత అవగాహన కల్పించాలని ఆలయవిభాగాన్ని ఆదేశించారు. ఇందుకోసం క్యూలైన్లు, ఆలయప్రవేశద్వారం మొదలైనచోట్ల మరిన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆలయవిభాగాన్ని ఆదేశించారు. ఇతరులతో ముఖ్యంగా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. భక్తుని సంబోధించేటప్పుడు వారిని ‘శివా’ లేదా ‘స్వామి’ అని సంబోంధించాలన్నారు.
*Uuyala Seva performed in Srisaila devasthanam today.
* B. Anjaneyulu, Ongole, Prakasham Dt, A.P. donated Rs. One Lakh For Gosamrakshana Nidhi in the temple.
Post Comment