శ్రీశైల దేవస్థానానికి ఐ.ఎస్.ఓ ధృవీకరణ
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రానికి విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్య పరంగా చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు, రక్షణా చర్యలకు ఐ.ఎస్.ఓ ( International organization for standardization ) ఆకుపేషినల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ ధృవీకరణ (ఐ.ఎస్.ఓ – 45001) లభించింది.
– అదేవిధంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు, కోవిడ్ నిబంధనలను పాటించడం మొదలైన చర్యలకుగాను జి.హెచ్.పి (గుడ్ హైజనిక్ ప్రాక్టీసెస్) ధృవీకరణ కూడా లభించింది.
హెచ్.వై.ఎం. అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ దేవస్థానానికి ఈ ధృవీకరణలు అందజేసింది.
ఈ మేరకు ఈ రోజు (22.08.2021) ఆ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఈ ధృవీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.ఎస్.
రామరావు కు అందజేశారు. రాష్ట్రంలో జి.హెచ్.పి ధృవీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైల దేవస్థానం కావడం విశేషం.అదేవిధంగా గతం లో సెప్టెంబరు, 2018లో మొత్తం 5 రంగాలలో దేవస్థానానికి అందిన ఐ.ఎస్.ఓ ధృవీకరణలు కూడా మరో మూడు సంవత్సరాల కాలపరిమితితో ధృవీకరించబడ్డాయి.దేవస్థానంలో వివిధ రంగాలలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకుగాను కొత్తగా రెండు విభాగాలకు సంబంధించిన ధృవీకరణలు, గతంలో ధృవీకరణలు పొందిన అయిదు విభాగాలలో ధృవీకరణ పునరుద్ధరణలు లభించాయి.
హెచ్. వై. ఎం అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ ప్రతినిధులు శ్రీశైలక్షేత్ర కార్యకలాపాలను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ధృవీకరణలు అందించారు.
వీటిలో వైద్యఆరోగ్యపరంగా చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు – రక్షణా చర్యలకు , పారిశుద్ధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనల పాటించడం మొదలైన అంశాలకు కొత్తగా ధృవీకరణలు లభించాయి.
గతంలో పొందిన దేవస్థాన పరిపాలనా విధివిధానాలకుగాను ఐ.ఎస్.ఓ – 9001 : క్వాలిటీ మేనేజ్ మెంట్ ధృవీకరణ, క్షేత్రపరిధిలో చెట్లను, ఉద్యానవనాలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు దేవస్థానం చేపడుతున్న చర్యలకుగాను ఐ.ఎస్.ఓ 14001 : ఎన్విరాల్ మెంటల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ధృవీకరణ, అన్నదానం, ప్రసాదాల తయారీలో దేవస్థానం పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకుగాను ఐ.ఎస్.ఓ -22000 : ఫుడ్ సేఫ్టీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ధృవీకరణ, ఎల్.ఈ.డి దీపాలను వాడకం, సౌరశక్తిలాంటి సాంప్రదేయతర ఇందనవనరుల వినియోగానికి గాను ఐ.ఎస్.ఓ – 50001 : ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ, అధునాతన పద్ధతిలో సీ.నీ కంట్రోల్ నిర్వహణ , సాఫ్ట్ వేర్ టెక్నాలజీ వినియోగానికి గాను ఐ.ఎస్.ఓ – 27001 : ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ ధృవీకరణలు ప్రస్తుతం పునరుద్ధణ అయ్యాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ దేవదాయశాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి డా. జి. వాణీమోహన్ , ఇతర అధికారులు ఎప్పటికప్పుడు తగు సలహాలు, సూచనలు చేస్తూ క్షేత్రాభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహాన్ని ఇ స్తున్నారన్నారు. దేవస్థానం సిబ్బంది కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు . అందరి కృషి వలనే ఈ ఐ.ఎస్.ఓ ధృవీకరణలు లభించాయన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బందికి కార్యనిర్వహణాధికారి కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Comment