
జాతీయ బిసి కమిషన్ వైస్ ఛైర్మన్ డాక్టర్ లోకేష్ కుమార్ ప్రజాపతి, నేషనల్ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఈ రోజు (13-08-2021) న ఉదయంశ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదం మండపంలో ఆలయ అధికారులు శేషా వస్త్రాలు, అందించగా అర్చకులు వేద పండితులు ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకట లక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడి నాగశివ లీల, తదితరులు పాల్గొన్నారు.