
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లోకకల్యాణం కోసం ఈ రోజు (13.08.2021) న సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం రోజు , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేసారు.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిగాయి.చివరగా ఊయలసేవ జరిపారు.
ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసారు.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.